వైయస్ జగన్ ప్రసంగం

కర్నూలుః ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మరికాసేపట్లో  ప్రసంగించనున్నారు.  తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్ లపై నోరుమెదపని

 చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య  వైఖరికి నిరసనగా  వైయస్ జగన్ చేపట్టిన జలదీక్ష నేటితో ముగియనుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైయస్ జగన్ మూడ్రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు వైయస్ జగన్ అలుపెరగకుండా పోరాడుతున్నారు. వైయస్ జగన్ కు సంఘీభావంగా రాష్ట్ర ప్రజానీకమంతా కర్నూలుకు కదం తొక్కింది. జననేత జలదీక్షకు మద్దతుగా నిలిచింది.  రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్న వైయస్ జగన్ కు జనం జేజేలు కొట్టారు. 
Back to Top