మైక్ కట్.. మంత్రి స్టార్ట్.. టాపిక్ డైవర్ట్

హైదరాబాద్:  శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతుండగా...మళ్లీ మైక్ కట్ అయ్యింది. పట్టిసీమపై మూడు రోజులుగా సాగుతున్న చర్చను బుధవారం ఆయన కొనసాగించారు.  తాము చెప్పేది గొడవలు చేయకుండా వినాలని అధికార పక్షానికి జగన్‌ విజ్ఞప్తి చేశారు. విపక్షం చెప్పే మాటల్ని సర్కారు వింటే ప్రజలకు మేలు కలుగుతుందని ఆయన అన్నారు. మాకు ఇచ్చిందే తక్కువ సమయమని, మాట్లాడే విషయంలో ప్రతిపక్షంపై వివక్ష చూపుతున్నారని ఆయన అన్నారు. మైక్ కట్..మంత్రి స్టార్ట్...టాపిక్ డైవర్ట్ అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. మాట్లాడనీవ్వకూడదు అని అనుకుంటే సమయమే ఇవ్వకూడదని ఆయన అన్నారు.
Back to Top