అంబేద్కర్ ను రాజకీయాలకు వాడుకొంటారా: వైఎస్ జగన్

శాసన సభలో మహనీయుడు అంబేద్కర్ ను రాజకీయాలకు వాడుకొనేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రభుత్వ వ్యవహార శైలిని వైెఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. ఇటువంటి పోకడల్ని చూసి అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుందని ఆయన అన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యే స్వయంగా నిందితులతో కలసిి విదేశాల్లో షికార్లు తిరుగుతున్నారని ఆయన అన్నారు. అయినా సరే, నిందితులు మాత్రం విదేశాల నుంచి రారని, ఎమ్మెల్యే తిరిగి వచ్చారని వివరించారు. అయినా సరే, ఎమ్మెల్యేను పోలీసులు కనీసం విచారణ చేయటం లేదని ప్రశ్నించారు. 
Back to Top