చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు– రాష్ట్రం కోసం పాండవుల్లాంటి ఐదుగురు ఎంపీలు పదవులు త్యాగం చేశారు
– టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించకపోవడం మోసం కాదా? 
– టీడీపీ ఎంపీలను ఆమరణ దీక్షకు కూర్చోబెట్టకపోవడం వాస్తవం కాదా?
– చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్న చిత్తశుద్ధి కరువైంది
– అఖిలపక్షం పేరుతో మళ్లీ మోసం చేసేందుకు ప్రయత్నం
– మోసానికి చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలి
– నేను అడిగే ఏడు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి
– చంద్రబాబు 7 నెలల పాటు ప్లానింగ్‌ కమిషన్‌కు లేఖ రాయలేదు
– అర్ధరాత్రి జైట్లీ ప్రకటనను చంద్రబాబు స్వాగతించారు
– హోదాతో ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని బాబు ప్రశ్నించలేదా?
– వృద్ధిరేటులో ముందున్నామని తప్పుడు ప్రచారం 
– హోదా కోసం మేం బంద్‌లు నిర్వహిస్తే బలవంతంగా బస్సులు నడపలేదా?
– ప్రధాని వస్తున్నారని దీక్షను భగ్నం చేసిన చరిత్ర చంద్రబాబుది
– హోదా కోసం నిజాయితీగా పోరాటం చేస్తుంది ఒక్క వైయస్‌ఆర్‌సీపీనే

 
గుంటూరు: మోసాలతో చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం ఒక్క వైయస్‌ఆర్‌సీపీనే నిజాయితీగా పోరాటం చేసిందన్నారు. రాష్ట్రం కోసం పాండవుల్లాంటి ఐదుగురు ఎంపీలు పదవులు త్యాగం చేశారని చెప్పారు. చంద్రబాబు మరోసారి అఖిలపక్షం పేరుతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల రాజీనామాలు, చంద్రబాబు అఖిలపక్షానికి రాసిన లేఖపై వైయస్‌ జగన్‌ శుక్రవారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..   మొట్ట మొదటగా ఐదుగురు ఎంపీలు రాజీనామా చేసిన సందర్భం దేశ చరిత్రలో ఎప్పుడు కూడా జరిగి ఉండకపోయి ఉండవచ్చు. ఎంపీలు రాజీనామాలు చేసిన వెంటనే ఆమరణనిరాహార దీక్షలో కూర్చోవడం ఇది ఒక చరిత్ర. ఆ ఐదుగురు ఎంపీలకు ఐదుకోట్ల మంది ఏపీ ప్రజల కోసం చేసిన త్యాగం. హోదా రావాలని, ఎటువంటి పరిస్థితుల్లో తీసుకురావాలని,  కేంద్రం దిగిరావాలని వీరు చేసిన పోరాటం దేశం మొత్తం చూడాలని, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీలు చేసిన ప్రయత్నం నిజంగా హర్షించదగ్గ విషయం. హోదా కోసం నాలుగేళ్లుగా వైయస్‌ఆర్‌సీపీ అన్ని రకాలుగా పోరాటాలు చేసింది. ఆఖరి అస్త్రంగా ఎంపీలచేత రాజీనామాలు చేయిస్తామని ఇది వరకే చెప్పాం. నిజంగా దానికి కట్టుబడి ఆఖరి అస్త్రంగా ఎంపీలతో రాజీనామా చేయించాం. చివరి బడ్జెట్‌ సమావేశాల్లో కూడా న్యాయం జరగని పరిస్థితి కనిపించకపోవడంతో ఎంపీలు రాజీనామాలు చేశారు. ఈ అఖరి అస్త్రంలో చంద్రబాబు కూడా భాగస్వామి అయ్యి ఉంటే ప్రత్యేక హోదా వచ్చి ఉండేదని మా నమ్మకం. మా ఎంపీలకు తోడు లోక్‌సభ స్థానాలకు టీడీపీ ఎంపీలు జతకట్టి ఉంటే దేశం మొత్తం చర్చ జరిగేది. కేంద్రం కూడా ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉండేది. కానీ చంద్రబాబు తన మోసం చేస్తున్న చరిత్రను కొనసాగిస్తున్నారు. తాను మోసం చేసిన కూడా వైయస్‌ఆర్‌సీపీ మాత్రం ఏపీ ప్రజలకు తోడుగా నిలిచేందుకు ఎవరు వచ్చినా..రాకపోయినా అవిశ్వాస తీర్మానం మొట్టమొదటగా ప్రవేశపెట్టింది మేమే. అన్ని పార్టీలకు తాను రాసిన లేఖలతో మా ఎంపీలు అందర్ని ఒప్పించారు. అవిశ్వాస తీర్మానానికి అందరి మద్దతు కూడగట్టారు. మోడీ ప్రభుత్వంపై మొట్టమొదటిసారిగా అవిశ్వాస తీర్మానం పెట్టింది వైయస్‌ఆర్‌సీపీనే అని చరిత్రలో నిలిచిపోయింది.
చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్న చిత్తశుద్ది కరువైంది. చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామాలు చేయించకపోవడం, టీడీపీ ఎంపీలు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయకపోవడం బాధాకరం. చంద్రబాబు ఈ రోజు అఖిలపక్షాలకు ఆహ్వానం పలుకుతూ ఓ లేఖ రాశారు. అఖిలపక్షం ఎందుకు పిలిచారంటే చంద్రబాబు ఢిల్లీ యాత్రపై చర్చించేందుకట. అక్కడ హేమామాలినితో ఎందుకు కలిశారో చెప్పడానికట. చంద్రబాబు ఢిల్లీలో కలిసిన నాయకులను వెళ్లపై లెక్కపెట్టలేము. రెండు గంటల పాటు అక్కడ పవర్‌ పాయింట్‌ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఎక్కడా కూడా ప్రత్యేక హోదాపై, ఎంపీల రాజీనామాలపై ప్రస్తావన లేదు. ఈయన గారు పిలిచిన అఖిలపక్షం మరోమారు మోసం చేయడమే. చంద్రబాబు ఎంత మోసగాడో అన్నది మరోమారు రుజువైంది. చంద్రబాబును పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ఢిల్లీలో చంద్రబాబు కలిసింది హేమామాలినిని కలిసి తిరిగి వచ్చారు. 

రాజకీయాల్లో విశ్వసనీయత అవసరం. చంద్రబాబుకు అది లేదు. ఆయన వెన్నుపోటు పొడవని వ్యక్తి, పార్టీ కానీ లేదు. ఏపీలోనూ, ఢిల్లీలోనూ చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు. క్లిష్ట పరిస్థితుల్లో హోదా వచ్చే అవకాశం ఉన్నా చంద్రబాబు జారవిడిచారు. కారణం ఏంటంటే చంద్రబాబు చేసిన అవినీతిపై కేంద్రం విచారణ చేపడుతుందన్న భయంతో, అనుమానంతో ఇలాంటి నాటకాలు ఆడుతున్నారు. తన ఎంపీలతో పార్లమెంట్‌లో ఆందోళన చేయించినట్లు డ్రామాలు ఆడారు. తన స్వార్థం కోసం ప్రత్యేక హోదాను చంద్రబాబు కేంద్రానికి తాకట్టు పెట్టారు. చంద్రబాబు ఎలాంటి వ్యక్తిత్వం అంటే పొట్టి శ్రీరాములు ఆమరణనిరాహార దీక్ష చేయడం వల్ల ఫలితం లేదు అని చెప్పే రకం. గాంధీ, సుబాష్‌చంద్రబోస్‌ పోరాటం చేయడం వల్ల స్వాతంత్య్రం రాలేదని చెప్పే మనస్తత్వం చంద్రబాబుది. ఎంపీల ఆమరణ నిరాహార దీక్షలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని చంద్రబాబు తన స్వార్థం కోసం ఏదైనా చెబుతారు. ఎలాగైనా మాట్లాడుతారు. దీనికి కారణం కూడా ఉండవచ్చు. చంద్రబాబు పుట్టిన గ్రహబలం ప్రకారం ఏప్రిల్‌20న పుట్టారు. అంటే 420 మనస్తత్వం. చంద్రబాబు, హిట్లర్‌ ఇద్దరిది ఒకే మనస్తత్వం. ఇద్దరిది గ్లోబెల్‌ ప్రచారమే. 

ఇదే చంద్రబాబు 420 గుట్టు గురించి మాట్లాడుతూ ఏడు ప్రశ్నలు వేస్తున్నాను. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం ఉందా బాబూ?
1. మార్చి 2. 2014 అంటే రాష్ట్రాన్ని విడగొట్టి పార్లమెంట్‌సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కేబినెట్‌ తీర్మానాన్ని ఆమోదించి ప్లానింగ్‌ కమిషన్‌కు పంపించారు. చంద్రబాబు 2014 జూన్‌లో ముఖ్యమంత్రి అయ్యారు. ఏడు నెలలు చంద్రబాబు అధికారంలో ఉంటూ ప్లానింగ్‌ కమిషన్‌కు కనీసం ఒక్క లేఖ కూడా రాయలేదు. ఒక్కసారి కూడా వారిని కలువలేదు. ఏడు నెలలు చంద్రబాబు ఏం చేశారు. గాడిదలు కాస్తున్నారా?ఇది అన్యాయం కాదా?

2. సెప్టెంబర్‌ 8, 2016న అర్ధరాత్రి ప్రత్యేక హోదాకు బదులు ఒక అబద్ధపు ప్యాకేజీని ప్రకటన చేశారు. అప్పుడు కేంద్ర మంత్రితో పాటు టీడీపీ కేంద్ర మంత్రులు పక్కనే ఉన్నారు. మీడియా లీకులు, విఫరీతమైన చర్చలు జరిపారు. చంద్రబాబు కోరిక మేరకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. దీనికి నిదర్శనం అరుణ్‌జైట్లీ రాసిన లేఖనే సాక్ష్యం. అదే అర్ధరాత్రి నిద్రమేల్కోని చంద్రబాబు అరుణ్‌జైట్లీ స్టేట్‌మెంట్‌ను స్వాగతించారు. ఢిల్లీకి వెళ్లి శాలువాలు కప్పి సన్మానించారు. అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానాలు పెట్టి అభినందించారు. అంతటితో ఆగకుండా ప్రత్యేక హోదా వల్ల ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయన్నారు. కోడలు మగబిడ్డను కంటే అత్త వద్దంటుందా అన్నారు. ఇది మోసం కాదా చంద్రబాబు?

3. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని ఇదే పెద్ద మనిషి పట్టుబడకుండా, బయటి ప్రపంచానికి సంకేతాలు ఇవ్వలేదా? లేనిపోని జీడీపీ గ్రాఫ్‌లు చూపించారు. ఏపీలో ఎటువంటి ఉద్యోగాలు రాకపోయినా 40 లక్షల ఉద్యోగాలు రాకపోయినాతప్పుడు ప్రచారం చేయలేదా? దేశం కంటే రాష్ట్ర ఆదాయం ఎక్కువగా ఉందని ప్రచారం చేయలేదా;

4. ఈ నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాపై ఏ పోరాటం చేసినా చంద్రబాబు చేసింది ఏంటీ? వైయస్‌ఆర్‌సీపీ అన్ని పార్టీలను కలుపుకొని బంద్‌కు పిలుపునిస్తే బ లవంతంగా బస్సులు నడిపిన చరిత్ర నీది కాదా చంద్రబాబు? మోడీ ఏపీకి వస్తున్నారని తాను నిరాహార దీక్షలు చేస్తే బలవంతంగా నా దీక్షను భగ్నం చేసిన చరిత్ర నీది కాదా బాబూ?. ఆందోళనలు నీరుగార్చిన చరిత్ర నీది కాదా? యువభేరిలతో యువత, విద్యార్థులను చైతన్యవంతం చేస్తుంటే ఆ కార్యక్రమానికి హాజరైతే పీడీ యాక్ట్‌ పెడుతామని పిల్లలను సైతం బెదిరించిన చరిత్ర నీది కాదా?  ఇవన్నీ ప్రత్యేక హోదాను నీరుగార్చుతూ నీవు చేసిన పనులు అన్యాయం, అ«దర్మం కాదా?

5. వైయస్‌ఆర్‌సీపీ అవిశ్వాస తీర్మానం పెట్టి ఉండకపోతే చంద్రబాబు పెట్టేవారా? మార్చిలో చంద్రబాబు మీకు సంఖ్యాబలం ఉంటేనే మీకు మద్దతిస్తామన్నారు. మరుసటి రోజు మార్చి 16న యూటర్న్‌ తీసుకున్నారు. కారణం వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు జగన్‌ రాసిన లేఖలు తీసుకుని అందర్ని ఒప్పిస్తుంటే, అందరు మద్దతు ప్రకటిస్తుంటే చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారు. తానే అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు, అందరూ తనకే మద్దతిస్తున్నట్లు కలరింగ్‌ ఇచ్చారు. ఇంతటి దారుణంగా ప్రజలను మోసం చేయడం అన్యాయం కాదా?

6. అఖిలపక్షమని మళ్లీ ఇవాళ డ్రామాలాడుతున్నారు. దొంగతనాల నివారణకు సలహాలు ఇవ్వమని మీటింగ్‌ పెట్టినట్లుగా ఉంది. ఎవరూ కూడా ఆందోళన చేపట్టకూడదట. ఉద్యమంలో విద్యార్థులు రాకూడదట. కేవలం నల్లబ్యాడ్జీలు ధరిస్తే ప్రత్యేక హోదా వస్తుందా? పార్లమెంట్‌ జరిగే సమయంలో ఇటువంటి తప్పుడు కార్యాచరణను చంద్రబాబు చేయాలనుకోవడం ఇది మోసం కాదా?

7. ఇవాళ ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని తెలిసీ, ఇది అఖరి బడ్జెట్‌ సమావేశమని తెలిసి వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేసి, ఆమరణ నిరాహార దీక్షలు చేపడితే , నీ సొంత స్వార్థం కోసం టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించకుండా, వారితో దీక్షలు చేయించకపోవడం మోసం కాదా చంద్రబాబు? ఇవాళ ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో చంద్రబాబు మళ్లీ ప్రజలను మోసం చేస్తూ అన్యాయం చేస్తూ సైకిల్‌ర్యాలీ, అఖిలపక్షం అంటూ మోసం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ మోసాలకు చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. ఇంతటి అన్యాయాలు చేసే బదులు చంద్రబాబు ఏదైనా బావిలో దూకితో ఏపీకి పట్టిన దరిద్య్రం పోతుంది. 
 
 
Back to Top