బాబు మాఫీ మోసంతో ముప్పు

 () రైతుల సమస్యలకు
చంద్రబాబు చేసిన రుణమాఫీ మోసం మూలకారణం

 () చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో పడేసే
రోజు వస్తుంది

() రైతు భరోసా
యాత్రలో మండిపడ్డ వైయస్ జగన్

అనంతపురం) ముఖ్యమంత్రి
చంద్రబాబు పాపాలు పండే రోజు దగ్గరలోనే ఉందని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ
అధ్యక్షులు వైయస్ జగన్ మండిపడ్డారు. ఈ ప్రభుత్వాన్ని త్వరలోనే ప్రజలు బంగాళాఖాతంలో
పడవేస్తారని ఆయన జోస్యం చెప్పారు. రైతాంగ సమస్యలకు చంద్రబాబు చేసిన రుణమాఫీ మోసం
ఒక ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు.

కష్టాల కడలిలో
అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యం చెప్పేందుకు, రైతు కుటుంబాలకు భరోసా
కల్పించేందుకు ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ చేపట్టిన రైతు
భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో సాగుతోంది. పెద వడుగూరు గ్రామంలో ఆయన రైతులతో
ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్బంగా వైయస్  జగన్
ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.

  చంద్రబాబు
నాయుడు ఎన్నికల సమయంలో ఎన్నెన్నో అబద్దాలు చెప్పారు. రైతులకు పూర్తిగా రుణమాఫీ
అన్నారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణమాఫీ అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు
కల్పిస్తామన్నారు. లేదంటే ఇంటింటికీ రెండు వేల రూపాయిల నిరుద్యోగ భ్రతి
కల్పిస్తామన్నారు.  ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ
హామీలు అమలు కాలేదని అర్థం అవుతోంది. ఎవరిని అడిగినా రుణమాఫీ జరగలేదని, ఉద్యోగాలు
రాలేదని చెబుతున్నారు. దీన్ని బట్టి ఏ హామీ అమలు కాలేదని తెలుస్తోంది. ఇక్కడకు
వచ్చే దారిలో ఉన్న కాలువ పనులు కూడా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి
హయంలో జరిగాయి. అప్పుడు రూ. 6వందల కోట్లతో దాదాపుగా కాలవ పనులు పూర్తయ్యాయి. కానీ
అందులో నీళ్లిచ్చే పని మాత్రం చంద్రబాబు చేయటంలేదు. అదేంటో కానీ చంద్రబాబు
ఉన్నారంటే వర్షాలు కూడా వేరే రాష్ట్రానికి వెళ్లిపోతున్నాయి.

          చంద్రబాబు రుణమాఫీ మాఫీ చేయకపోవడంతో రైతులు 2 రూపాయల వడ్డీ కడుతున్నారు. అపరాధ
రుసుంచెల్లించాల్సిన పరిస్థితి ఉంటోంది. దాదాపు 14 శాతం దాకా వడ్డీలు కట్టాల్సి
వస్తోంది. పంట బీమా రావడం లేదు, ఇన్‌పుట్ సబ్సిడీ అంతంతమాత్రమే. చివరకు నీళ్లొస్తాయని చూస్తుంటే బాబు పుణ్యాన
నీళ్లు రాకపోగా పక్క రాష్ట్రంలో కేసీఆర్ ఎడాపెడా ప్రాజెక్టులు కట్టేసి, పంపులు పెట్టి నీళ్లు తన్నుకుపోతుంటే కనీసం
అడిగే పరిస్థితి కూడా లేని దౌర్భాగ్య పరిస్థితి చూస్తున్నాం. రైతుల బాధలు అర్థం
కావాలి. ఆయన అక్కడెక్కడో బంగారు మేడలో కూర్చుని అంతా బాగున్నారు, రైతు రుణాలన్నీ మాఫీ చేశాను, డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఆనందంతో ఉన్నారని
అబద్ధాలు చెబుతున్నారు. ఇక్కడి రైతులు చెప్పిన మాటలు.. ఆయనకు అర్థమైతే కాస్తో
కూస్తో మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం.

          ఎన్నికల సమయంలో డ్వాక్రా అక్క
చెల్లెమ్మలకు అన్ని రకాలుగా రుణమాఫీ చేస్తానని చెప్పారు. అప్పులు కట్టాల్సిన అవసరం
లేదని నమ్మబలికారు. దీంతో అప్పులు కట్టకుండా నిలిచిపోయినందుకు గాను వడ్డీల మీద
వడ్డీలు పడుతున్నయి. అటు రైతులకు రుణాలు రెన్యువల్ అయి ఉంటే కాస్తో కూస్తో క్రాప్
ఇన్సూరెన్స్ వచ్చేది. మాఫీ కాక, రెన్యువల్ కాక, బీమా రాక అన్యాయం అయిపోతున్నారు. కనీసం
ఇప్పటికైనా రైతులు ఎలా బాధపడుతున్నారో చంద్రబాబుకు అర్థం కావాలి. రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలు, చేనేత కార్మికుల అవస్థలు తెలియాలి. కనీసం ఈ
మీటింగ్ ద్వారానైనా చంద్రబాబు గారు రైతుల పరిస్థితి అర్థం చేసుకుని వాళ్లకు తోడుగా
నిలబడేందుకు ఆయనకు జ్ఞానోదయం కావాలి. ఈ విషయమై ఆయనపై గట్టిగా ఒత్తిడి తెస్తాం.

          ఇక్కడ మరో విషయం చెప్పాల్సి ఉంది. ఎన్నికలు
పూర్తయి రెండేళ్లు అయింది. చంద్రబాబుకి ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఎన్నికల హామీలు
అమలు చేయాలన్న ధ్యాస లేదు. ప్రజల తరుపున ఈ హామీల మీద ప్రశ్నించాల్సిన ఎమ్మెల్యేలను
కొనేందుకు మాత్రం ప్రయత్నిస్తున్నారు. ప్రజల గొంతు వినపడకుండా చేసేందుకు ఎన్ని
ప్రయత్నాలు చేయాలో అన్ని చేస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 30, 40 కోట్లు ఇచ్చి
కొనుగోలు చేస్తున్నారు. చంద్రబాబు వచ్చినప్పుడు మాత్రం అడగాల్సి ఉంది. ఇంత అవినీతి
డబ్బు మీకు ఎక్కడ నుంచి వస్తోంది. అని ప్రశ్నించాలి. ప్రజల తరుపున ప్రశ్నించాల్సిన
ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే సరిపోతుంది అనుకొంటున్నారా. ఏ పాపమైనా పండాల్సిందే.
చంద్రబాబు చేసిన పాపాలన్నీ త్వరలోనే పండుతాయి. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో పడేసే రోజులు ఉన్నాయి. ఒక్క  విషయం గట్టిగా చెబుతున్నాం. మీ
తరపున గట్టిగా నిలబడతాం, మీ తరపున గట్టిగా పోరాడుతాం.

          అని వైయస్ జగన్ రైతులకు హామీ ఇచ్చారు. 

Back to Top