సంతలో గొర్రెలను కొన్నట్లు కొంటున్నాడు

హైదరాబాద్ః రాష్ట్రంలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ...అలా వచ్చిన బ్లాక్ మనీ సొమ్ముతో ఎమ్మెల్యేలను సంతలో గొర్రెలను కొన్నట్లు కొంటున్నాడని మండిపడ్డారు. ఒక్కో ఎమ్మెల్యేకి 20 నుంచి 30 కోట్లు, మంత్రి పదవులు ఎరచూపుతూ కొనుగోలు చేస్తున్న దానిపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ ను కోరినట్లు వైఎస్ జగన్ తెలిపారు. అవినీతి డబ్బులతో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు దుర్మార్గాలను ఆపాలని గవర్నర్ కు చెప్పినట్లు వైఎస్ జగన్ పేర్కొన్నారు. 

చంద్రబాబుకు తన పాలనపై నమ్మకం లేదని, ప్రజలు ఓట్లు వేస్తారన్న నమ్మకం లేకే తీసుకుపోయిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించకుండా కాపాడుతున్నాడని వైఎస్ జగన్ మండిపడ్డారు. బాబుకు ప్రజాస్వామ్యంపై ఏమాత్రం గౌరవమున్నా...సిగ్గు, రోశం ఏ కోశాన ఉన్నా తీసుకున్న ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు. అప్పుడు ప్రజలు ఎవరికి ఓట్లేస్తారో తేలుతుంది. బాబుకు దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలన్నారు. 
Back to Top