అధికారం కోసం బాబు ఏ గడ్డి అయినా తింటాడుః వైఎస్ జగన్

హైదరాబాద్ః రాష్ట్రంలో చంద్రబాబు పాలన దారుణంగా ఉందని ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. రాజధానిలో బాబు బినామీ భూదందా, పోలవరం అవతవకలు, అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం సహా అనేక అంశాలపై సభలో ప్రభుత్వాన్ని ఎండగట్టామని వైఎస్ జగన్ చెప్పారు. పార్టీ కార్యాలయంలో  మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ...రాజధానిలో చంద్రబాబు  ఏవిధంగా ఇన్ సైడ్ ట్రేడింగ్ చేశారో సభలో నిలదీశామన్నారు. ప్రైవేటు వ్యక్తులకు లబ్ది చేకూర్చేందుకు చంద్రబాబు విద్యుత్ కొనుగోళ్లలో భారీగా కుంభకోణాలకు పాల్పడిన విషయాన్ని సభావేదికగా ఎండగట్టామన్నారు. 


అగ్రిగోల్డ్ బాధితులకు బాబు ఏవిధంగా  అన్యాయం చేశారో సభలో ప్రస్తావించామన్నారు. ఇసుకలో చంద్రబాబుకు వాటాలున్నాయని, నీకింత నాకింత అన్న విధంగా ఇసుకలో రూ.2 వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారని నిప్పులు చెరిగారు. ఎడాపెడా రెండేళ్లపాటు ఇసుకను దోచుకొని బాబు ఇప్పుడు ఇసుక ఫ్రీ అని మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.  సబ్ ప్లాన్  విషయంలో ఎస్సీ, ఎస్టీలను మోసం చేశారని, రైతులు, డ్వాక్రామహిళలు, నిరుద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు తన అవినీతితో రాష్ట్రాన్ని స్కాం ఆంధ్రగా మార్చాడని విరుచుకుపడ్డారు. అధికారం కోసం బాబు ఏగడ్డి అయినా తింటాడని జననేత ఫైరయ్యారు. 
Back to Top