చంద్రబాబు అవినీతి మహారాజు: వైఎస్ జగన్

విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వానికి పబ్లిసిటీ కావాలి తప్పితే ప్రజల అవసరాలు పట్టడం లేదని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. అందుకే ప్రజల అవసరాలు పట్టించుకోవటం లేదని ఆయన అభిప్రాయ పడ్డారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో వైఎస్ జగన్ పర్ర్యటించారు.
మొదటగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకొని అక్కడ నుంచి రోడ్మార్గంలో ఎలమంచిలి నియోజక వర్గంలోని అచ్యుతాపురం చేరుకొన్నారు. ఇటీవల కాలంలో ధవళేశ్వరం దగ్గర గోదావరి నదిలోకి వాహనం బోల్తా కొట్టిన ఘటనలో 22 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబంలో పుట్టెడు శోకం నెలకొంది. బాధితుల్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ ఆ గ్రామానికి వెళ్లారు. అక్కడ ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ ప్రమాదం జరిగి వారాలు గడుస్తున్నా ఇప్పటిదాకా పరిహారం ఇవ్వలేదని జగన్ మండిపడ్డారు. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి అందలేదని ఆయన అన్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగి 22మంది చనిపోయినా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి పలకరించలేదని ఆయన గుర్తు చేశారు. మంత్రులు వచ్చి హడావుడిగా మీడియా ముందు పబ్లిసిటీ కోసం ఒక్కొక్కరికి రూ. 2లక్షల చొప్పున పరిహారం ప్రకటించారని, కానీ ఇందులో ఒక్క దమ్మిడీ కూడా విదల్చలేదని అభిప్రాయ పడ్డారు.
ఇప్పటి దాకా ఎందుకు పరిహారం ఇవ్వలేదు, ఎందుకిలా మోసం చేస్తున్నారని వైఎస్ జగన్ నిలదీశారు. అప్పుడు మంత్రులు వచ్చి పబ్లిసిటీ కోసం సాయం చేస్తామంటూ ప్రకటనలు చేశారని, కానీ తర్వాత మాత్రం పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిసిటీ కార్యక్రమం ఉంటే చంద్రబాబు వెళ్లి అక్కడ రూ. 5లక్షలు అందిస్తారని, వీళ్లు కూడా మనుషులే అని, కానీ రూ. 5లక్షలు ఎందుకు ప్రకటించలేదని ్రపశ్నించారు. వాళ్లకు ఇష్టం లేదంటే మాత్రం పరిహారం కూడా తగ్గిస్తారు, లేదంటే అస్సలు ఇవ్వనే ఇవ్వరని ఆయన అన్నారు. రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు కానీ ఒక్క రూపాయి  కూడా ఇవ్వలేదని అన్నారు.
ప్రభుత్వం దారుణంగా పనిచేస్తోందని వైఎస్ జగన్ మండిపడ్డారు.  నాలుగు రోజులు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నాలుగు రోజుల్లో సహాయం అందించక పోతే ధర్నా కార్యక్రమం చేపడతామని అన్నారు. కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇక్కడకు రాబట్టి కనీసం వీళ్లకు సాయం అందలేదన్న విషయం తె లిసిందని జగన్ అన్నారు.

హత్య చేయటం తప్పు కాదు కానీ, వీడియో తీయటం తప్పా..!
అనంతరం వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు బయలు దేరారు. మార్గ మధ్యలో పాయకరావు పేట నియోజకవర్గం లోని నక్కపల్లి దగ్గర ఆగారు. పార్టీ నేతలు చెంగల వెంకట్రావు, గొల్ల బాబురావులతో స్థానికపరిస్థితుల గురించి మాట్లాడారు. రాష్ట్ర తాజా రాజకీయాలపై స్పందించారు. ఒక వ్యక్తిని హత్య చేయటం తప్పు కాదు కానీ, ఆ హత్యను ఎవరైనా వీడియో తీస్తే వీడియో తీయటం తప్పని చంద్రబాబు ఆంటున్నారని వైఎస్జ గన్ అన్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో సెక్షన్-8 అనేది ఒక అంశం మాత్రమే అని, తాను తప్పు చేసిన తర్వాత చంద్రబాబు కు ఆ సెక్షన్ గురించి గుర్తుకొచ్చినట్లుందని ఆయన అన్నారు. రాష్ట్రం సమైక్యం గా ఉండాలని కోరుకొన్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. విభజనకు మొట్టమొదటిసారిగా పార్లమెంటులో టీడీపీ ఎంపీలు ఓటేసి మద్దతు తెలిపారు. ఆ రోజు చంద్రబాబు కు సిగ్గులేదు..బుద్ది లే దు. చాలా స్పష్టంగా రాష్ట్ర విభజనకు చంద్రబాబు పాలు పంచుకొన్నారు. రాష్ట్రం విడిపోయాక ఆ రాష్ట్రంలో రాజకీయంగా మేం ఏ పార్టీకి మద్దతు ఇస్తే చంద్రబాబుకి ఎందుకు..! రాజకీయం కోసం ప్రజలను తప్పు దోవ పట్టించడం కోసం చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రజల్ని తప్పు దారి పట్టించేందుకే ఈ సెక్షన్ - 8 మీద రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. లంచాలు తీసుకొన్న డబ్బులతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను చంద్రబాబు కొంటున్నారని జగన్ అన్నారు. కరప్షన్ మహారాజు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే అని ఆయన అన్నారు.

తూ.గో. జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
అనంతరం వైఎస్ జగన్ రోడ్డు మార్గం గుండా తూర్పు గోదావరి జిల్లాలో అడుగు పెట్టారు. అక్కడ తుని నియోజకవర్గం లోని తొండంగి మండలం పెరుమాళ్లపాలెం, హుకుంపేట, కొత్తపట్నం, రామన్న పాలెం గ్రామాల్లో పర్యటించారు. ఇటీవల కాలంలో సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఇళ్లకు వెళ్లి అక్కడి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.
Back to Top