పిల్లలకు స్కూల్ దగ్గరగా ఉంటేనే మంచిది: వైఎస్ జగన్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో క్లస్టర్ స్కూళ్ల ఏర్పాటుతో ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏమిటని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు.  అసెంబ్లీలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ స్కూళ్ల అంశంపై చర్చ జరిగింది. మండలానికి ఒక్క స్కూలే ఉంటే ఎలా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. పిల్లలకు స్కూల్ దగ్గరగా ఉంటేనే మంచిదని, ఒక కిలోమీటర్లోపే పాఠశాల ఉంటే బాగుంటుందన్నారు. స్కూల్ దూరంగా ఉంటే డ్రాప్ అవుట్స్ ఉంటాయని, పిల్లల భవిష్యత్ నాశనం అవుతుందని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సమాధానం ఇస్తూ పిల్లలకు ఇబ్బంది లేకుండా, వారి విద్యకు ఆటంకం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

తాజా వీడియోలు

Back to Top