ప్రజలకు తోడుగా

వైయస్సార్ కడపః  జిల్లాలో ప్రతిపక్ష నేత పర్యటనకు విశేష ఆదరణ లభించింది. జననేతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పార్టీ నాయకులు, ప్రజలు, అభిమానులు వైయస్ జగన్ పై పూలవర్షం కురిపించారు.  రెండ్రోజుల పాటు జిల్లాలో వైయస్ జగన్ విస్తృతంగా పర్యటించారు. ప్రజల కష్టాలను అడిగి తెలుసుకొని వారికి నేనున్నానంటూ కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. రెండో రోజు పర్యటనలో భాగంగా వైయస్ జగన్ ఇవాళ ఉదయం పులివెందుల అమ్మవారిశాలకు చేరుకుని దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పెండ్లిమర్రిలో వేరుశనగ రైతులతో మాట్లాడారు. 


వేలి ముద్రలు వేయించుకుని విత్తన కూపన్లు ఇస్తున్నారని రైతులు ఆయనకు ఫిర్యాదు చేశారు. దీని వల్ల చాలా మంది రైతులు నష్టపోతున్నారని జగన్ వద్ద వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వైయస్ జగన్ తీవ్రంగా స్పందించారు. విత్తనాల కోసం రైతులు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొవాలా.. ?అంటూ  అధికారులను నిలదీశారు. వేలి ముద్రలు తీసుకోకుండా విత్తనాలు పంపిణీ చేయాలని సూచించారు. దీనిపై పెండ్లిమర్రి రైతులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం చెన్నూరులో ప్రత్యేకహోదాపై నిర్వహించిన ప్రజాబ్యాలెట్ లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని  స్పష్టం చేశారు. ప్రజాబ్యాలెట్ లో ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. 


Back to Top