కారు ప్రమాదంపై వైయస్ జగన్ దిగ్ర్భాంతి

పశ్చిమ గోదావరిః జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దెందులూరు మండలం కొవ్వలి వద్ద ఓ కారు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంపై  వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

కొవ్వలిలో ఓ శుభకార్యానికి హాజరై  తిరిగి వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న స్కార్పియో అదుపు తప్పి కాల్వలోకి దూసుకువెళ్లింది. ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో డ్రైవర్‌తో సహా తొమ్మిదిమంది ఉన్నారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మృతులు కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లపల్లి వాసులుగా గుర్తించారు.

తాజా ఫోటోలు

Back to Top