వైయ‌స్ జగన్‌ దిగ్భ్రాంతి

అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు ప్రమాదంపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆక్వా ఫుడ్‌ పరిశ్రమలో విషవాయువులు పీల్చి ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఆనంద్‌ ఫ్యాక్టరీలో రసాయన ట్యాంక్‌ క్లీన్‌ చేస్తుండగా విష వాయువులు వెలువడటంతో ఐదుగురు కార్మికులు కన్నుమూశారు. ఈ ఘటనపై వైయస్‌ జగన్‌ ఆరా తీశారు.

Back to Top