ఆ ఐదుగురికి సెల్యూట్‌– మా ఎంపీలు భయకుండా రాజీనామాలు చేశారు
– 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగివచ్చేది
– ఉప ఎన్నికలు వస్తే ధైర్యంగా ఎదుర్కొంటాం
– ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తే అదృష్టంగా భావిస్తాం
– ఉప ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా రావు
– అనైతికంగా పార్టీలో చేర్చుకుంటే అనర్హతపై నిర్ణయం తీసుకోలేదు

పశ్చిమ గోదావరి జిల్లా:  ప్రత్యేక హోదా కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, నిరుద్యోగులకు ఉపాధి కోసం చిత్తశుద్ధితో 14 నెలల ఎంపీ పదవీ కాలం ఉన్నా .. త్యాగం చేసిన ఆ ఐదుగురికి వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సెల్యూట్‌ చేశారు. ఎంపీల రాజీనామాలు హర్షనీయమని ఆయన పేర్కొన్నారు.   రాజీనామాల విషయంలో టీడీపీ వెనక్కి తగ్గిందని విమర్శించారు.  ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్‌ సిపాయిలా పోరాటం చేస్తుందన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ బుధవారం నిడదవోలు నియోజకవర్గంలో ఎంపీల రాజీనామాలపై స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. మా ఐదుగురు ఎంపీలు భయపడకుండా రాజీనామాలు చేశారని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. రాజకీయాల్లో ఈ రోజు నిజాయితీ కావాలన్నారు. రాజీనామాల విషయంలో టీడీపీ వెనక్కి తగ్గిందని వైయస్‌ జగన్‌ విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలు రాజీనామాలు చేస్తే..ఏదైనా బుద్ధి ఉన్న పార్టీ తమ అభ్యర్థులను పెడతారా? అంటే వారు ప్రత్యేక హోదాకు అనుకూలమా? వ్యతిరేకమా అని వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు. కామన్స్‌సెన్స్‌ ఉన్నవారు ఎవరూ ఆ పని చేయరన్నారు. 

చంద్రబాబు సిగ్గుమాలి తన పార్టీ అభ్యర్థులను పెడితే మా అదృష్టంగా భావిస్తామని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావాలని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలు వస్తే ధైర్యంగా ఎదుర్కొంటామని ఆయన ప్రకటించారు.  రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగివచ్చేదన్నారు. తప్పు చేసి ఇతరులపై బురదచల్లడం చంద్రబాబు నైజమని మండిపడ్డారు. రాజకీయాల్లో నిజాయితీ, విశ్వసనీయత అవసరమన్నారు. 

మన ఖర్మ ఏంటంటే చంద్రబాబుకు ఈ రెండు లేకపోవడమే అన్నారు. వైయస్‌ఆర్‌సీపీ తరఫున గెలిచిన ఎంపీ ఎస్పీవై రెడ్డి ప్రమాణ స్వీకారం చేయకముందే టీడీపీలో చేరారని, మొన్న కర్నూలు ఎంపీ కూడా అధికార పార్టీలో చేరిందన్నారు. ముగ్గురు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలకు చంద్రబాబు కండువా కప్పి చంద్రబాబు తన పక్కనపెట్టుకున్నా..వారిపై అనర్హత వేటు వేయలేదన్నారు. ప్రతి పార్లమెంట్‌ సమావేశంలో మేం అడిగినా ఇంతవరకు ఎలాంటి ^è ర్యలు తీసుకోలేదని, అంతగా చంద్రబాబు కేంద్రంలో మేనేజ్‌ చేస్తున్నారని విమర్శించారు. సంతలో పశువులు మాదిరిగా కొన్న 23 మంది ఎమ్మెల్యేలలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారన్నారు. తన మనిషే స్పీకర్‌ అని, వారిపై అనర్హత వేటు వేసి ఎన్నికలకు వచ్చే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని నిలదీశారు. 

ఫిరాయించిన ఎమ్మెల్యేలను తన పార్టీ గుర్తుపై నిలబెట్టి ఉప ఎన్నికల్లో గెలిపించుకునే సత్తా చంద్రబాబుకు ఉందా అని వైయస్‌ జగన్‌ సవాలు విసిరారు. అనైతికంగా పార్టీలో చేర్చుకుంటే వారిపై ఇంతవరకు అనర్హత వేటు వేయలేదని తప్పుపట్టారు. రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా వస్తుందని తెలిసీ కూడా..ఆ పని చేయకపోగా ఆ తప్పును కప్పి పుచ్చుకునేందుకు రాజీనామా చేసిన వ్యక్తులపై బురద చల్లడం బాధాకరమన్నారు.  ఎంపీల రాజీనామాను తప్పుగా వక్రీకరించడం ఇదేం రాజకీయాలని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ఏం చేస్తే బాగుంటుందని తెలిసిన మీడియా కూడా సహకరించకపోవడం సరికాదన్నారు.
 
Back to Top