భూమిపొరల్లోంచి మొలకెత్తే విత్తనం వైయస్‌ జగన్‌


చంద్రబాబు దళిత ద్రోహి.. దళిత వ్యతిరేకి
హోదా సాధించే సత్తా వైయస్‌ జగన్‌కే ఉంది
దళిత సంక్షేమ వైయస్‌ జగన్‌తోనే సాధ్యం
వైయస్‌ఆర్‌ సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున

అనంతపురం: చంద్రబాబు పెలపెల విరిగిపోయే చెట్టులాంటి వాడని, భూమి పొరల్లోంచి విత్తనం సుతిమెత్తంగా మొలకెత్తుతుందని, అతడే వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున అన్నారు. ప్రత్యేక హోదాను గాలికివదిలేసి రాష్ట్రాన్ని అవినీతి మయం చేసి పక్షపాతంతో పరిపాలన చేస్తున్న దుర్మార్గుడు చంద్రబాబు అని మేరుగ ఆరోపించారు. అనంతపురంలో చేపట్టిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. జన్మభూమి అడ్డం పెట్టుకొని చంద్రబాబు పాలన చేస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక  హోదా 15 సంవత్సరాలు అవసరమన్న చంద్రబాబు అదే నోటితో హోదాతో ఏం లాభం అని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అలుపెరగని నాయకుడిగా రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం వైయస్‌ జగన్‌ అనేక ఉద్యమాలు చేస్తున్నారన్నారు. హోదా తప్పనిసరిగా అవసరం.. హోదా సాధించే సత్తా వైయస్‌ జగన్‌కు మాత్రమే ఉందని ప్రజలు గమనించారన్నారు. ప్రజల ఆగ్రహాన్ని తెలుసుకున్న చంద్రబాబు యూటర్న్‌ తీసుకొని హోదా అంటే అరుపులు అరుస్తున్నారని, ఎన్ని కేకలు వేసినా చేసిన మోసాన్ని ప్రజలెవరూ మర్చిపోలేదన్నారు. 

బడుగు, బలహీనవర్గాలు, దళిత సంక్షేమాన్ని భుజాన వేసుకొని పరిపాలన చేసిన ఏకైక ముఖ్యమంత్రి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అని మేరుగు గుర్తు చేశారు. పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా వైయస్‌ఆర్‌ పరిపాలన సాగిందన్నారు. కానీ చంద్రబాబు దళితులను కించపరిచేలా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. దళితులు శుభ్రంగా ఉండరు.. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని మాట్లాడిన చంద్రబాబును పల్లెల్లో దళితులెవరూ తిరుగనివ్వొద్దన్నారు. దళితుల కోసం రూ. 40 వేల కోట్ల ఖర్చు చేశానని నెల్లూరు సభలో చెప్పారని, ఆ ఖర్చుపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని మేరుగు డిమాండ్‌ చేశారు. సబ్‌ప్లాన్‌ నిధులు మింగేసిన ముఖ్యమంత్రిగా.. దళితులపై దాడులు చేసిన ముఖ్యమంత్రిగా.. దళిత చట్టాలను అపహాస్యం చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారన్నారు. అంబేద్కర్‌ ఆలోచన విధానాలను పునికిపుచ్చుకున్న పార్టీ వైయస్‌ఆర్‌ సీపీ అన్నారు. ఎన్ని శక్తులు ఎదురైనా వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని, దళిత సంక్షేమం వైయస్‌ జగన్‌తోనే సాధ్యమన్నారు.
Back to Top