వైయస్ జగన్ రెండో రోజు షెడ్యూల్

పశ్చిమ గోదావరి జిల్లాః ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ పశ్చిమగోదావరి జిల్లా పర్యటన రెండవ రోజు కొనసాగుతోంది. దుద్దుకూరులో చింతమనేని హనుమంతరావు ఆధ్వర్యంలో ఆయిల్ ఫాం రైతులు ఈ ఉదయం వైయస్ జగన్ ను కలుసుకున్నారు. తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. క్రూడ్ పామాయిల్పై 12.5 శాతం దిగుమతి పన్ను విధించారని, అయితే పామాయిల్ టన్నుకు మద్దతు ధర రూ.7,494 మాత్రమే ఇస్తున్నారన్నారు. టన్ను పామాయిల్ మద్దతు ధర రూ.10వేలకు పెంచేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని రైతులు ఈ సందర్భంగా వైయస్ జగన్కు విజ్ఞప్తి చేశారు. 

కాసేపట్లో  వైయస్ జగన్ జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతులతో వారి సమస్యలపై ముఖాముఖి నిర్వహించనున్నారు. మధ్యాహ్నం కుక్కునూరులో పర్యటించనున్నారు. పోలవరం నిర్వాసితుల రిలే దీక్షకు వైయస్ జగన్ మద్దతు పలకనున్నారు. 

Back to Top