పులివెందులలో పర్యటించిన వైయస్ జగన్

పులివెందుల‌) ప్ర‌తిప‌క్ష నేత‌, వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ ఈ రోజు పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం దాకా క్యాంపు కార్యాల‌యంలో స్థానికుల‌కు అందుబాటులో ఉన్నారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మ‌ధ్యాహ్నం సింహాద్రిపురం మండ‌లం చెర్లోప‌ల్లి లో ఎంపీ నిధుల‌తో ఏర్పాటు చేసిన వాట‌ర్ ప్లాంట్ ను ఆయ‌న ప్రారంభించారు.  త‌ర్వాత తొండూరు వెళ్లి రైతులతో కలిసి అక్క‌డ వేరుశ‌న‌గ పొలాల్ని ప‌రిశీలించారు.  నాణ్యమైన విత్తనాలు అందించాలని కలెక్టర్ కు సూచించారు.  త‌ర్వాత తొండూరు మండ‌లం మ‌ల్లేల లో మిన‌ర‌ల్ వాట‌ర్ ప్లాంట్ ను ప్రారంభించారు.

Back to Top