రెండో రోజు క్యాంపు కార్యాల‌యంలో వైయ‌స్ జ‌గ‌న్‌

పులివెందుల‌) పులివెందుల నియోజక వ‌ర్గంలో ప్రతిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న రెండో రోజుకి చేరింది. రెండో రోజైన మంగ‌ళ‌వారం ఉద‌యం ఆయ‌న అక్క‌డ క్యాంపు కార్యాల‌యంలో గడుపుతున్నారు. ప్ర‌జ‌ల నుంచి విన‌తులు స్వీక‌రిస్తున్నారు. క్ర‌మం త‌ప్ప‌కుండా నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌టం ఆయ‌న‌కు అల‌వాటు.
మధ్యాహ్నం పులివెందుల మండ‌లం అచ్చ‌వెళ్లి చేరుకొని మిన‌ర‌ల్ వాట‌ర్ ప్లాంట్ ను ప్రారంభిస్తారు. అనంతరం పార్టీ విద్యార్థి విభాగం నేత హ‌రీష్ కుమార్ యాద‌వ్ కుటుంబ స‌భ్యుల్ని ఆప్యాయంగా ప‌ల‌క‌రించ‌నున్నారు.
Back to Top