రెండవ రోజు వైయస్ జగన్ ప్రచార షెడ్యూల్

కర్నూలు: వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ నంద్యాలలో రెండవ రోజు ప్రచార షెడ్యూల్ ఈవిధంగా ఉంది.   నూనెపల్లె నుంచి అయ్యలూరు వరకూ ప్రచారం కొనసాగుతుందని వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తెలిపారు. ఉదయం 8:30 గంటలకు నంద్యాల మండలం నూనెపల్లె క్రాస్ నుంచి ప్రారంభమైన రోడ్ షో 9:30 గంటలకు చాబోలు, 10 గంటలకు చాబోలు టెక్కెకు చేరుకుంటుంది. అనంతరం గోస్పాడు మండలం సాంబవరంలో 10:30 గంటలకు, దీబగుంట్ల మీదుగా కానాలపల్లె, ఎస్‌. నాగులవరం, నెహ్రూనగర్, సత్యనారాయణపురం, జిల్లెల్ల, తిరిగి దిబగుంట్లకు చేరుకుంటారు. అనంతరం దీబగుంట్ల మీదుగా అయ్యలూరిమెట్ట, అయ్యలూరు వరకూ (సాయంత్రం 4 గంటలకు) రోడ్‌ షో సాగుతుందని ప్రకటించారు.
Back to Top