రాష్ట్ర ప్రయోజనాలే ప్ర‌ధానం


అమరావతి: రాష్ట్రం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే తమ పార్టీకి ప్రధానమని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. దీనికోసం ఏ త్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు అందిందని, దీనిపై సోమవారం చర్చిస్తామని లోక్‌సభ స్పీకర్‌ చెప్పిన నేపథ్యంలో వైయ‌స్‌ జగన్‌ ట్వీటర్‌లో స్పందించారు. 

‘రాజకీయ ప్రయోజనాల కంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత ముఖ్యం. వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ ముందు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా, ఎవరి తీర్మానం పరిగణనలోకి తీసుకుంటారనేది ముఖ్యం కాదు. ఆంధ్రప్రదేశ్‌ పౌరుల హక్కులకు హామీ దొరికిందా? రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చిందా?  అన్నదే ముఖ్యం’ 

తాజా ఫోటోలు

Back to Top