సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందాం

పశ్చిమ గోదావరి జిల్లా: అంబేద్కర్ విగ్రహ వివాదంపై  వాస్తవాలను తెలుసుకోవడానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గరగప్రరుకు చేరుకున్నారు. గ్రామంలో సాంఘీక బహిష్కరణకు గురైన దళితులను వైయస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలనే ఇక్కడికి వచ్చానని, రెండు పక్షాలతో మాట్లాడుతానన్నారు. సమాజంలో అంతా కలిసి ఉండాలనే నా భావన అని చెప్పారు. దాని కోసమే ఈ ప్రయత్నం అన్నారు. ప్రతి కులంలో మంచి, చెడు రెండు ఉంటాయని, ఎవరో ఒకరు చేసిన తప్పును ఆ కులం అంతటికీ ఆపాదించడం సరికాదన్నారు. ఒకవేళ పొరబాటు జరిగివుంటే దాన్ని సరిదిద్దుకుందామన్నారు. దాని వల్ల ఔన్నత్యం పెరుగుతుందని వైయస్‌ జగన్‌ అభిప్రాయపడ్డారు.


ఒకటి చేసేందుకు కృషి చేస్తా..
కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అన్ని విగ్రహాలకు వర్తింపజేయాలని వైయస్‌ జగన్‌ అభిప్రాయపడ్డారు. దళితేతరులతో వైయస్‌ జగన్‌ చర్చించారు. సమస్యను పరిష్కరించుకునే దిశగా కృషి చేయాలి. ఊరంటే అంతా ఉండాలి, అందరూ ఊళ్లో కలిసివుండాలని వైయస్‌ జగన్‌ అన్నారు. రోజూ మనం ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలన్నారు. ప్రధానంగా గరగప్రరులో రెండు సమస్యలపై ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయని, విగ్రహ వివాదం, రెండవది ఒకరికొకరికి మధ్య కమ్యూనికేషన్‌ లోపం అన్నారు. దళితులను పనులకు పిలవకూడదని, వారితో మాట్లాడకూడదని ఎవరో అన్నారంట. ఒకరో ఇద్దరో పొరబాటులు చేస్తే వారిని శిక్షించాలి. దళితులతో కూడా చర్చించి గ్రామాన్ని ఒక్కటి చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తానని వైయస్‌ జగన్‌ అన్నారు. 


Back to Top