వైయస్‌ జగన్‌ సంతాపం

అమరావతి: సినీ నటుడు, శ్రీ విద్యానికేతన్‌ విద్యా సంస్థల అధినేత డాక్టర్‌ మంచు మోహన్‌బాబుకు మాతృవియోగం కలిగింది. లక్ష్మమ్మ మృతి పట్ల వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి తదితరులు లక్ష్మమ్మకు నివాళులర్పించారు.
 
Back to Top