సుధాక‌ర్ మృతి ప‌ట్ల వైయ‌స్ జ‌గ‌న్ దిగ్భ్రాంతి

తూర్పు గోదావ‌రి:  ప్రత్యేక హోదా కోసం సుధాక‌ర్ అనే యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం ప‌ట్ల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. తూర్పు గోదావ‌రి జిల్లాలో పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ సుధాక‌ర్ మృతికి సంతాపం తెలుపుతూ..కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతికి వ్య‌క్తం చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లె రామరావు కాలనీకి చెందిన పారిశుద్ధ్య కార్మికులు రామచంద్ర, సరోజమ్మల కుమారుడు సుధాకర్ శనివారం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘ప్రత్యేక హోదా మన హక్కు’ అని సూసైడ్‌ నోట్‌ రాసి సుధాకర్‌(26) ఆత్మహత్య చేసుకున్నాడు. హోదా కోసం బలిదానం చేసుకోవడం చిత్తూరు జిల్లాలో ఇది రెండో సంఘటన కాగా.. గతంలో ముని కోటి అనే వ్యక్తి తిరుపతిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇక సుధాకర్‌ ప్రత్యేక హోదా కోసం నిర్వహించిన కార్యక్రమంలో చురుకుగా పాల్గొనేవాడని స్థానికులు తెలిపారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన చేనేత కార్మికుల సమావేశంలో కూడా సుధాకర్‌ తనగళాన్ని వినిపించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. 
Back to Top