వైఎస్ జగన్ సంతాపం..!

ప్రత్యేకహోదా కోసం ఆగిన గుండె..!
వైఎస్ జగన్ ఆవేదన...!

పశ్చిమగోదావరి జిల్లా ఉంగటూరు మండలం చేబ్రోలులో ప్రత్యేకహోదా కోసం మరో గుండె ఆగింది. సుందరపు దుర్గాప్రసాద్(50) ఆత్మబలిదానం చేసుకోవడం ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను తీవ్రంగా కలచివేసింది. దుర్గాప్రసాద్ కుటుంబసభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దుర్గాప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. 

హోదా కోసం ప్రజలు ప్రాణాలు కోల్పోవడాన్ని వైఎస్ జగన్ జీర్ణించుకోలేక పోతున్నారు. రాష్ట్రంలో ఆత్మబలిదానాల పరంపర కొనసాగుతుండడం పట్ల  కలత చెందుతున్నారు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దన్న ఉద్దేశ్యంతోనే రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు, యువత భవిష్యత్ దృష్ట్యా, వైఎస్ జగన్ ....ప్రత్యేకహోదా కోసం ప్రాణాలు పణంగా పెట్టి దీక్ష చేసిన సంగతి తెలిసిందే. పోరాడి రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించుకుందామని వైఎస్ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు కూడా. ఐనా ఇలాంటి విషాద సంఘటనలు చోటుచేసుకోవడం బాధాకరం. 


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా తెచ్చుకుందామని...అప్పటివరకు విశ్రమించేది లేదని వైఎస్ జగన్ మొదటి నుంచి చెబుతున్నారు. ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షను తాకట్టుపెట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై ఎప్పటికప్పుడు నిలదీస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించేవరకు పోరు ఆగదని ..ఎవరూ ఆందోళన చెందవద్దని వైఎస్ జగన్ రాష్ట్రప్రజానీకానికి సూచించారు.

Back to Top