వైయస్ జగన్ రైతు భరోసా యాత్ర

కర్నూలు:  అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు కర్నూలు జిల్లాలో వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘రైతు భరోసా యాత్ర’  నేడు(ఆదివారం) నాలుగోరోజుకు చేరుకుంది. నేటి యాత్ర వెలుగోడు మండలం వేల్పనూరులో ప్రారంభమైంది. అక్కడి నుంచి సంతజుటురు, నారాయణపురం, చిన్నదేవలపురం, లింగాపురం, జీసీ పాలెం, సింగవరం, సోమయాజులపల్లె, మణికంఠాపురం, వీర్నపాడు మీదుగా వైయస్ జగన్ రోడ్ షో కొనసాగుతుందని పార్టీ నేతలు తెలిపారు. నేటి యాత్రలో భాగంగా లింగాపురంలో దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైయస్ఆర్ విగ్రహాన్ని  వైయస్ జగన్ ఆవిష్కరించున్నారు.


Back to Top