వైయస్‌ జగన్‌ రైతు మహాధర్నా

()రైతులపై ప్రభుత్వం వివక్ష
()అన్నదాతకు బాసటగా జననేత
()అనంత కలెక్టరేట్ ఎదుట మహాధర్నా

అనంతపురంః  రైతాంగం సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ పోరుబాట పట్టారు. ఇవాళ అనంతపురం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట రైతులతో కలిసి వైయస్ జగన్ మహాధర్నా చేపట్టనున్నారు. ఈ ధర్నాలో పాల్గొని వ్యవసాయంపై చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షసాధింపు చర్యలను నిలదీయనున్నారు. అనంతలో కరువు తాండవిస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు.  రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ , ఇన్సూరెన్స్ డబ్బులు ఇంతవరకు ఇచ్చిన పాపాన పోలేదు. ఈనేపథ్యంలో అన్నదాతకు బాసటగా వైయస్ జగన్ ధర్నాలో ప్రభుత్వ దుర్మార్గాలను ఎండగట్టనున్నారు. 

అదే విధంగా అకాల వర్షం కారణంగా లక్షలాది ఎకరాల పంట నీట మునిగి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నా.. చంద్రబాబు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. రైతులకు పంట నష్టం అందించేలా, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు వైయస్‌ జగన్‌ చంద్రబాబు సర్కార్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఈ మహాధర్నా చేపడుతున్నారు. వరద ప్రభావిత గ్రామాల్లో చంద్రబాబు పర్యటించినా అక్కడ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. బాధితులకు ఏమాత్రం సాయం అందకపోవడం సిగ్గుచేటని పార్టీ నేతలు విమర్శించారు.

తాజా వీడియోలు

Back to Top