రైతన్నకు తోడుగా జననేత మహాధర్నా

రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపడుతున్నారు. ఈ ధర్నాకు వైయస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. ధర్నాకోసం ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అనంత వెంకట్రామిరెడ్డి, తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. వర్షాభావంతో ‘అనంత’తో పాటు రాయలసీమలో వేరుశనగ పూర్తిగా ఎండిపోయిన విషయం తెలిసిందే. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో ‘అనంత’ కేంద్రంగా మహాధర్నా చేపట్టాలని వైయస్సార్‌సీపీ జిల్లా నాయకత్వం నిర్ణయించింది.

Back to Top