అనంతలో రైతు భరోసా యాత్ర

  • జూన్‌ 1 నుంచి ప్రారంభం
  • ఐదో విడత వైయస్‌ జగన్‌ యాత్రకు షెడ్యూల్‌ ఖరారు
  • వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ
  • చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు
  • ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు
  • వైయస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి

  • అనంతపురం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా యాత్రకు సిద్ధమయ్యారు. జూన్‌ 1 నుంచి అనంతపురం జిల్లాలో ఐదో విడత యాత్రకు షెడ్యూల్‌ ఖరారైంది. స్థానిక పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు శంకర్‌నారాయణ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి వైయస్‌ జగన్‌ పర్యటన వివరాలను వెల్లడించారు. జూన్‌ ఒకటవ తేదిన రైతు భరోసా యాత్ర మొదలవుతుందన్నారు. తాడిపత్రి, కదిరి నియోజకవర్గాల్లో అప్పులబాధతో మృతి చెందిన కుటుంబాలను వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించనున్నట్లు పేర్కొన్నారు. గతంలో నాలుగు విడతలు వైయస్‌ జగన్‌ రైతు భరోసా యాత్ర చేపట్టారని గుర్తు చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల్లో భరోసా కల్పించేందుకు ఐదో విడత యాత్రకు సన్నద్ధమైనట్లు చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించిన తరువాత మిగిలిన కుటుంబాలను కూడా కలుస్తారని చెప్పారు. వైయస్‌ జగన్‌ యాత్రను తాడిపత్రి, కదిరి నియోజకవర్గాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతుబంధువులు జయపద్రం చేయాలని కోరారు.

    మహానాడులో వైయస్‌ జగన్‌పై విమర్శలు దారుణం 
    – ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి
    తెలుగుదేశం పార్టీ మూడు రోజులుగా నిర్వహించిన మహానాడులో టీడీపీ నేతలు దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి, వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిల జపం చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డిలు విమర్శించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతలు దాదాపు 800 సార్లు వైయస్‌ఆర్, వైయస్‌ జగన్‌ల పేర్లు తలుచుకున్నారన్నారు. చంద్రబాబు నిద్రలో కూడా వైయస్‌ జగన్‌ పేరు తలచుకుంటున్నారేమోనని  ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అధికార పార్టీ చేస్తున్న అన్యాయాలు, అక్రమాలపై పోరాడుతున్న ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు.మహానాడులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించకుండా కేవలం ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌ చేసి దూషించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. చంద్రబాబు తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే ప్రతిపక్షంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. 

    ప్రత్యేక హోదా అంశంపై కూడా చర్చించకుండా ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. రెండేళ్లయినా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను  నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. పైగా చేయనివి కూడా చేసినట్లుగా చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఫైరయ్యారు. అమరావతి పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుపెడుతూ అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. రాజ్యసభకు నాల్గవ అభ్యర్థి పోటీకి వ్యూహాలు రచించడం చంద్రబాబు అవినీతి, దిగజారుడు రాజకీయాలకు అద్ధం పడుతుందన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని లూటీని చేయడాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని, బాబు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాప్తాడు నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్‌ తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Back to Top