శ్రీ‌నివాస‌పురంలో జ‌న‌నేత రోడ్ షో

నంద్యాలః ఉప ఎన్నిక‌ల్లో భాగంగా రోడ్ షో నిర్వ‌హిస్తున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి శ్రీ‌నివాస‌పురం గ్రామ ప్ర‌జ‌లు అపూర్వ స్వాగ‌తం ప‌లికారు. గ్రామ ప్ర‌జ‌లు అభిమాన నేత‌ను క‌లుసుకునేందుకు, ఆయ‌న‌తో క‌ర‌చాల‌నం చేసేందుకు పోటీ ప‌డ్డారు. నాలుగో రోజు నంద్యాల నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌నేత ప్ర‌చారం ఉత్సాహంగా సాగుతోంది. ఏ గ్రామానికి వెళ్లినా ప్ర‌జ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌కు నీరాజ‌నం ప‌లుకుతున్నారు. వైయ‌స్ఆర్ సీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్‌రెడ్డిని అత్య‌ధిక మెజార్టీతో గెలిపించి, మోస‌కారి టీడీపీ ప్ర‌భుత్వానికి బుద్ధి చెబుతామని అంటున్నారు. 

Back to Top