వైయస్ జగన్ రోడ్ షో

అనంతపురంః ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. ఐదో రోజు యాత్రలో భాగంగా కదిరి నియోజకవర్గంలోని ముదిగబ్బకు వచ్చిన వైయస్ జగన్ ప్రజలు ఘనస్వాగతం పలికారు. జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. కాసేపట్లో నగరంలో వైయస్ జగన్ రోడ్ షో ఉంటుంది. మరోవైపు, వైయస్ జగన్ రైతు భరోసా యాత్రను అడ్డుకునేందుకు టీడీపీ కుట్రలు పతాకస్థాయికి చేరాయి. సప్తగిరి సర్కిల్ లో పచ్చనేతలు వైయస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి తెబబడ్డారు. టీడీపీ నేతల దాడులు, దౌర్జన్యాలను నిరసిస్తూ పార్టీశ్రేణులు, ప్రజలు కాసేపట్లో ఎస్పీ కార్యలయం వద్ద ధర్నా చేపట్టనున్నారు. ఈధర్నాలో వైయస్ జగన్ పాల్గొననున్నారు.

Back to Top