రోడ్ ప్రమాద బాధితులకు వై ఎస్ జగన్ సంతాపం


విజయవాడ. గొల్లపూడి దగ్గర జరిగిన రోడ్ ప్రమాదం పై ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సంతాపం తెలిపారు.
హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థులు విజయవాడ నుంచి హైదరాబాద్ కు తిరిగి వస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లో వెనక్కి వస్తుండగా గొల్లపూడి దాటాక బస్సు అదుపు తప్పి చెట్టుని ఢీ కొట్టింది. నలుగురు మెడికోలు, డ్రైవర్ అక్కడికక్కడే చనిపోగా, పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. 
ఈ ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని కోరారు. 
Back to Top