చెన్నయ్ వాసులకు అన్ని రకాలుగా సహాయక చర్యలు

వరద లతో ఇక్కట్లు
ఎదుర్కొంటున్న చెన్నయ్ వాసులకు ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్
సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ట్వీట్
చేశారు.

వరదల్ని ఎదుర్కోవటంలో
చెన్నయ్ ప్రజలు చూపుతున్న నిబ్బరం ఎంతో ఉత్ర్రష్టమైనది. సంక్లిష్ట సమయంలో ఉన్న మీ
అందరికీ మా అండదండలు అందిస్తున్నాం. ప్రజల్ని ఆదుకొనేందుకు అన్ని రకాలుగా
సహకరించాలని, సహాయక చర్యల్లో చురుగ్గా నిమగ్నం కావాలని తోటివారందరినీ కోరుతున్నా.
ముఖ్యంగా ప్రభుత్వం తరపున చురుగ్గా సహాయక చర్యలు జరగాలని ఆశిస్తున్నా.

ఈ మేరకు వైఎస్ జగన్ తన
సందేశాన్ని అందించారు. 

Back to Top