80 పేజీల పుస్తకాన్ని విడుదల చేసిన వైఎస్సార్సీపీఏడాది పాలనను తొమ్మిది అంశాలుగా విభజించి విశ్లేషణహైదరాబాద్: వాగ్దానాలను మరిచి, ప్రజలపై భారం మోపుతూ సాగుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీరుపై విపక్ష వైఎస్సార్‌సీపీ నిప్పులు చెరిగింది. బాబు ప్రభుత్వం ఏడాది పాలనపై ‘రాష్ట్రానికే మోసగాడు’ పేరిట 80 పేజీల పుస్తకాన్ని విడుదల చేసింది. చంద్రబాబు ఇచ్చిన హామీలు, ఆయన పరిపాలన తీరుతెన్నులను పుస్తకం మొత్తంగా తొమ్మిది అంశాలుగా విభజించి విశ్లేషించింది.
సమరదీక్ష వేదికపై జగన్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. వివిధరంగాల్లో చంద్రబాబు అక్రమాలు, అవినీతి వ్యవహారాలను సోదాహరణంగా వివరిస్తూ, ఆయా సందర్భాల్లో జారీ చేసిన జీవోలను ఊటంకించారు. ‘వాగ్దానాలన్నీ వంచనలు.. అధికారంతో అరాచకాలు.. ఇలాంటి పాలన ఇంకా నాలుగేళ్లు భరించాలా? అని ప్రశ్నించారు. ‘ఇదా మనం కోరుకున్న సంక్షేమ రాజ్యం? ఇదా మనం ఆశించిన నూతన రాష్ట్రం?’ అని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నలతో పుస్తకం ప్రారంభమైంది.
Click here for చంద్రబాబు 'రాష్ట్రానికే మోసగాడు’ 80 పేజీల పుస్తకం : http://www.ysrcongress.com/files/mosagadu.pdf

బాబు తొలి ఐదు సంతకాల గురించి ప్రస్తావిస్తూ.. ‘తొలి సంతకమే మోసం. రెండో సంతకం దగా. మూడో సంతకం వంచన. నాలుగో సంతకం నయ వంచన. ఐదో సంతకం అబద్ధం’ అని పేర్కొన్నారు. ‘ఆయన ఐదు సంతకాలు అమల్లోకి వస్తే.. ఆ క్షణం నుంచే వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ కావాలి. బెల్టు షాపులు రద్దయి మద్యం విక్రయాలు తగ్గాలి. ఇంటింటికీ రూ. 2 కే రోజూ 20 లీటర్ల మినరల్ వాటర్ అందాలి. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పోరేషన్లలో పదవీ విరమణ వయసు 60 సంవత్సరాలు అమలు కావాలి.
సామాజిక పెన్షన్లలో 10 లక్షలు తొలగించకుండా అందరికీ పెంచిన పెన్షన్ వర్తింపజేయాలి’ అని వివరించారు. సంతకాలు పెట్టిన వాటికే దిక్కులేకుంటే.. మిగతా వాగ్దానాలకు ఉన్న విలువ ఏమిటి? అని ప్రశ్నించారు. ‘బాబు ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టో మరిచిపోయారు.. ఇప్పుడు ఆయన మేనిఫెస్టో దోపిడీ.. వంచన’ అని నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వమే రాజధాని భవనాలన్నీ కట్టాలని విభజన చట్టంలో ఉంటే... కమిషన్‌కోసమే సింగపూర్ సంస్థలకు పది వేల ఎకరాలు అప్పనంగా కట్టబెట్టే వ్యూహం పన్నారని పేర్కొన్నారు.
ఏడాది క్రితంతో పోలిస్తే ఏపీలో ప్రజల బతుకులు నాలుగు మెట్లు కిందికి దిగితే.. చంద్రబాబు 40 మెట్లు పెకైదిగారని తెలిపారు. పట్టిసీమలో, బెరైటీస్‌లో, జలయజ్ఞంలో, ఇసుకలో, డిస్టిలరీల్లో దోచుకున్న అవినీతి మహాసాగరంలో నీటిబిందువులైన రూ.ఐదు కోట్లతోనే తెలంగాణలో ఎమ్మెల్యే కొనుగోలుకు పాల్పడ్డారని పేర్కొన్నారు. చంద్రబాబు ఏడాదిలోనే ఎంత దోచారో, ఎక్కడ దాచారో, ఏం చేయాలనుకుంటున్నారో, 35 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఆయన బతుకేమిటో మరోసారి ఈ నోట్ల కట్టల ద్వారా బట్టబయలైందని ఒక్కో అంశంపై సోదాహరణగా పుస్తకంలో వివరించారు.