సేవకుడంటే వైయస్‌ జగన్‌

తూర్పు గోదావరి: సేవకుడంటే వైయస్‌ జగన్‌ అని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. శనివారం రామచంద్రాపురం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వాతావరణంతో సంబంధం లేదు..అన్నా..నీ వెంటే ఉంటామని వేలాది మంది స్వచ్ఛందంగా వచ్చారన్నారు. ఈ రాష్ట్రంలో పేదవాడి గుండె ఆగిపోకుండా కాపాడిన మహానీయుడు వైయస్‌ రాజశేఖరరెడ్డి అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంతో ఎంతో మందిని ఉన్నత చదువులు చదివించారన్నారు. మహానేత మరణాంతరం రాష్ట్రం అధకారంలో ఉందన్నారు. అసెంబ్లీలో వైయస్‌ జగన్‌ను మాట్లాడకుండా చేసినా..ప్రజలంతా వైయస్‌ జగన్‌ వెంటే ఉన్నారని చెప్పారు. ప్రజలను ఆదుకునేందుకు వైయస్‌ జగన్‌ నవరత్నాలు తెచ్చారని తెలిపారు. ప్రజా సంకల్పం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. సేవకుడంటే జగనన్న అని నినదించారు.
Back to Top