వైయస్‌ జగన్‌ అంటే నమ్మకం

  • బాబు అంటే మోసం..దగా
  • బాబు మోసపూరిత వాగ్ధానాలు నమ్మొద్దు  
  • నంద్యాల: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అంటేనే నమ్మకమని, ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి వైయస్ జగన్  అని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య పేర్కొన్నారు. చంద్రబాబు అంటే మోసం, దగా అని, నంద్యాల ఉప ఎన్నిక నమ్మకానికి, మోసానికి మధ్య జరుగుతున్న యుద్ధమని, ఇందులో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎవరినైనా సులువుగా మోసం చేసే నైజమన్నారు. మూడున్నరేళ్లుగా నంద్యాలను పట్టించుకోని సీఎం ఇవాళ ఉప ఎన్నిక వచ్చిందని రూ.1300 కోట్లతో అభివృద్ధి పనులకు హడావుడిగా శంకుస్థాపనలు చేశారన్నారు. ఎన్నికలు అయిపోయిన తరువాత ఈ హామీలను తుంగలో తొక్కుతారని విమర్శించారు. గతంలో శిల్పా మోహన్‌రెడ్డి టీడీపీలో ఉన్న సమయంలో దీబగుంట్లలో జరిగిన మీటింగ్‌లో నంద్యాల రోడ్ల విస్తరణపై బాబును కోరగా, అప్పట్లో డబ్బులు లేవన్నారన్నారు. ఇప్పుడేమో శంకుస్థాపనలు చేశారన్నారు.సొంత మామనే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. నవ నందుల మధ్య ఉన్న నంద్యాల ప్రజలు తెలివిని ప్రదర్శించి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని, మీరు వేసే ఓటు వచ్చే ఎన్నికలకు నాంది కావాలన్నారు. వైయస్‌ జగన్‌ ఇటీవల నంద్యాల మీటింగ్‌లో తెలిపిన నవ రత్నాల పథకాలకు ప్రజల్లో విశేష స్పందన వస్తుందని, అందరూ వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారని ఎమ్మెల్యే ఐజయ్య తెలిపారు.
Back to Top