గుంటూరు చేరుకున్న వైఎస్ జగన్

గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం గుంటూరు చేరుకున్నారు. దాచేపల్లి మండలం పొందుగులలో ఆయనకు పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రేపాల శ్రీనివాసరావు, పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రేపాల రమాదేవి దంపతుల కుమార్తె దివ్య సింధూర వివాహానికి వైఎస్ జగన్ హాజరై వధువరూలను ఆశీర్వదిస్తారు. అలాగే పిడుగురాళ్లలో పార్టీ సీనియర్ నాయకుడు అల్లు పిచ్చిరెడ్డి అన్న కుమారుడు వెంకటరెడ్డి, దుర్గాభవాని పెళ్లికి ఆయన హాజరు అవుతారు.

తాజా వీడియోలు

Back to Top