గూడురు నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌నెల్లూరు: ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవాలనే లక్ష్యంతో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. 72వ రోజు శనివారం సూళ్లూరుపేట నియోజకవర్గం ఓజిలి మండలం చిలమానుచేను క్రాస్‌రోడ్డు నుంచి వైయ‌స్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. మ‌ధ్యాహ్నం భోజ‌న విరామం అనంత‌రం వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర పునః ప్రారంభం కాగా కాండ్ర వ‌ద్ద గూడురు నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర అడుగుపెట్టింది. కాండ్ర‌ చేరుకున్న ఆయనకు ప్రజలు, మహిళలు పెద్దసంఖ్యలో ఘనస్వాగతం పలికారు. రాజ‌న్న బిడ్డ రాక‌తో పుర వీధులు కిక్కిరిసి జన సందోహంతో కోలాహలంగా మారింది. పార్టీ నాయ‌కులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డికి పుష్పగుచ్ఛాలు అందించి సాదరంగా స్వాగతించారు. వీధుల్లో, భవనాలపై కిక్కిరిసిన జనసందోహాన్ని చూసిన జగనన్న ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ ముందుకుసాగారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు త‌మ స‌మ‌స్య‌ల‌ను వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ అధికారంలోకి రాగానే సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తామని జననేత వారికి హామీ ఇచ్చారు. 
Back to Top