రాక్షసపాలనపై యుద్ధానికి దేవుడి దయ కావాలిగూడూరు: రాక్షసపాలననపై యుద్ధం చేస్తున్న మనకు దేవుడి దయ మెండుగా కావాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 74వ రోజు గూడూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్రలో భాగంగా గోగినేనిపురం వద్ద వైయస్‌ జగన్‌ మహిళలతో మాట్లాడారు. ఈ సందర్భంగా జననేత మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను అనేక విధాలుగా మోసం చేసిందని, అందుకే ప్రజల కష్టాలను తెలుసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పాదయాత్ర చేపట్టడం జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఏం చేయబోతున్నామనేది అందరికీ తెలుసుసా.. మీకు తెలిస్తేనే నలుగురికి చెప్పగలరని వైయస్‌ జగన్‌ అన్నారు. మన ప్రభుత్వం రాగానే పిల్లలను బడికి పంపిన ప్రతి తల్లికి ఏడాదికి రూ. 15 వేలు అందిస్తామని, పిల్లలు ఉన్నత చదువులు చదివి డాక్టర్లు, ఇంజినీర్లు అవుతేనే మన బతుకులు మారుతాయన్నారు. అదే విధంగా అవ్వా, తాతలకు పెన్షన్‌ రూ. 2 వేలు చేస్తామని, పెన్షన్‌ వయస్సు కూడా 45 సంవత్సరాలకు తగ్గిస్తామన్నారు. అంతేకాకుండా పొదుపు సంఘాల మహిళల అప్పు తీర్చేందుకు నాలుగు దఫాలుగా ఆ డబ్బు చేతికే ఇస్తామని, అదే విధంగా సున్నా వడ్డీకే రుణాలు అందిస్తామన్నారు. మనం అధికారంలోకి వచ్చాక చేయబోయే కార్యక్రమాలను మీరు అందరికీ చెప్పాలని, అదే విధంగా దేవుడిని గట్టిగా ప్రార్థించాలని మహిళలకు సూచించారు. 

Back to Top