పాల్మన్ పేట చేరుకున్న వైయస్ జగన్

విశాఖపట్నంః ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు.  పాల్మన్ పేట చేరుకున్నారు. ఇటీవల టీడీపీ నేతల దాడిలో గాయపడిన మత్స్యకారులను వైయస్ జగన్ పరామర్శించారు. కొద్దిసేపటి క్రితమే వైయస్ జగన్ మునగపాకలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా మాట్లాడుతూ...అబద్ధపు హామీలిచ్చి మోసం చేసిన చంద్రబాబును నిలదీయాలని పార్టీనేతలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఇచ్చిన వాగ్ధానాలు  నెరవేర్చేవరకు పోరాటం కొనసాగిద్దామని స్పష్టం చేశారు.

Back to Top