కాకినాడ చేరుకున్న వైఎస్ జగన్

కాకినాడ:   వైయస్ఆర్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కు
చేరుకొన్నారు. అక్కడ కలెక్టరేట్ వద్ద ధర్నాలో పాల్గొంటున్నారు. అంతకు ముందు ఉదయం
రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్నారు. వైఎస్ జగన్ కు విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం
రాజమండ్రి నుంచి ఆయన రోడ్డు మార్గంలో కాకినాడ బయల్దేరారు. కాగా ప్రత్యేక హోదాపై
చేతులెత్తేసిన తెలుగుదేశం,
బీజేపీల తీరును
ఎండగట్టి హోదా సాధనే ధ్యేయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనకు
ఈసారి జిల్లా కేంద్ర బిందువైంది. పార్టీ అధ్యక్షుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్
రెడ్డి ఇవాళ కాకినాడలో కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో పాల్గొననుండటంతో రాష్ట్ర ప్రజల
చూపు జిల్లాపై పడింది. జిల్లాలో ఏ మూల ఎవరికి ఏ ఆపద వచ్చినా అందరికంటే ముందుగా
వచ్చి వారిని ఓదార్చే వైఎస్ జగన్ ఈసారి రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా కాకినాడ
ధర్నాలో పాల్గొననుండటంతో పార్టీ రహితంగా అన్ని వర్గాలూ అభిమానాన్ని కురిపించేందుకు
ఎదురుచూస్తున్నాయి.

 To read this article in English:  http://bit.ly/1TBEQAC 


Back to Top