స్వస్థలానికి చేరుకున్న వైఎస్ జగన్ ..!

స్వస్థలం చేరుకున్న వైఎస్ జగన్ ..!
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పార్టీశ్రేణుల ఘనస్వాగతం..!
రోడ్డుమార్గాన లోటస్ పాండ్ చేరుకున్న జననేత..!

హైదరాబాద్ః వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్వస్థలానికి చేరుకున్నారు. ప్రత్యేకహోదా సాధన కోసం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ జగన్.. 8 రోజుల తర్వాత మళ్లీ తన ఇంటికి చేరుకున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం డిశ్చార్జ్ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డుమార్గాన గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని హైదరాబాద్ కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీశ్రేణులు వైఎస్ జగన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి వైఎస్ జగన్ రోడ్డు మార్గాన హైదరాబాద్లోని  లోటస్ పాండ్ కు విచ్చేశారు. జగన్ వెంట మాతృమూర్తి వైఎస్ విజయమ్మ, సతీమణి భారతి తదితరులు ఉన్నారు.

ప్రత్యేకహోదా డిమాండ్ తో అక్టోబర్ 7న వైఎస్ జగన్ ఇంటినుంచి బయలుదేరి గుంటూరు నల్లపాడు రోడ్డుకు చేరుకున్నారు. మధ్యాహ్నం 2.15 గంటలకు నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. ఏడురోడులపాటు నిద్రహారాలు మాని దీక్ష కొనసాగించారు. వైఎస్ జగన్ కు తోడుగా కుటుంబసభ్యులు, పార్టీనేతలు, కార్యకర్తలతో పాటు రాష్ట్రప్రజానీకమంతా కదం తొక్కింది. వెల్లువలా తరలివచ్చి వైఎస్ జగన్  దీక్షకు మద్దతు తెలిపారు. నిర్విరామంగా దీక్ష కొనసాగించడంతో వైఎస్ జగన్ ఆరోగ్యం పూర్తిగా విషమించింది. 

వైఎస్ జగన్ దీక్షతో వణికిపోయిన చంద్రబాబు కుట్రలకు తెరలేపాడు. భజన బ్యాచ్ తో  రిపోర్ట్ లు తారుమారు చేయడం మొదలు అనేక దారుణాలకు ఒడిగట్టాడు. దీక్ష ఏడవ రోజుకు చేరుకున్న సమయంలో చీకట్లో పోలీసులను పంపించి బలవంతంగా దీక్షను భగ్నం చేశాడు. మంగళవారం ఉదయం 4.11 గంటలకు దీక్షాస్థలికి చేరుకున్న పోలీసులు వైస్ జగన్ శిబిరాన్ని చుట్టిముట్టారు. వైఎస్ జగన్ వద్దని వారిస్తున్నా వినకుండా 108లో దొంగతనంగా జీజీహెచ్ కు తరలించారు. వైఎస్ జగన్ వైద్యానికి నిరాకరించినా బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. రెండ్రోజుల పాటు ఐసీయూలో చికిత్స పొందిన అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. 


Back to Top