కర్నూలు: ప‌్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కొద్ది సేపటి క్రితమే పత్తికొండ నియోజకవర్గంలోని ఎర్రగుడి గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం 8.30 గంటలకు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం రామకృష్ణాపురం నుంచి వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. ఎర్రగుడి గ్రామం నుంచి వైయస్ జగన్ పాదయాత్ర ఇవాళ కోడుమూరు నియోజకవర్గంలోకి అడుగుపెడుతోంది. గోరంట్ల గ్రామం వద్ద వైయస్ జగన్‌కు ఘనస్వాగతం పలికేందుకు కోడుమూరు నియోజకవర్గ నాయకులు, ప్రజలు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు.