తాడేపల్లిగూడెంలోకి ప్రవేశించిన ప్రజా సంకల్ప యాత్ర
ప.గో. జిల్లా:  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కొద్ది సేపటి క్రితం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా జననేతకు నియోజకవర్గ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఇవాళ ఉదయం ప్రకాశరావుపాలెంలో నిర్వహించిన గిరిజనుల ఆత్మీయ సమ్మేళనంలో వైయస్‌ జగన్‌ పాల్గొని వారి సమస్యలు తెలుసుకున్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే గిరిజనులకు పెద్ద పీట వేస్తామని,దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మెరుగ్గా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top