శివ‌రాంపురంలో మ‌హానేత విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ‌- వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం
- దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ఆర్‌కు ఘ‌న నివాళి
 ప్ర‌కాశం :  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌జ‌ల హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయారు. ఆయ‌న హ‌యాంలో ల‌బ్ధిపొందిన ప్ర‌జ‌లు మ‌హానేత‌ను గుర్తుకు తెచ్చుకుంటూ త‌మ గ్రామంలో విగ్ర‌హం ఏర్పాటు చేసుకున్నారు. ఈ విగ్ర‌హాన్ని మ‌హానేత త‌న‌యుడు, వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్క‌రింప‌జేసుకున్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 102వ రోజు ప్ర‌కాశం జిల్లాలో కొన‌సాగుతుంది. ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలోని శివ‌రాంపురం గ్రామంలోకి అడుగుపెట్టిన వైయ‌స్ జ‌గ‌న్ చేతుల మీదుగా  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రింపజేశారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా త‌మ గ్రామానికి వ‌చ్చిన రాజ‌న్న బిడ్డ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం తాము నాలుగేళ్ల‌లో ఎదుర్కొంటున్న క‌ష్టాల‌ను చెప్పుకున్నారు. వారి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విన్న వైయ‌ష్ జ‌గ‌న్ మ‌రో ఏడాదిలో రాజ‌న్న పాల‌న వ‌స్తుంద‌ని భ‌రోసా క‌ల్పించారు.
Back to Top