ఎన్టీఆర్‌ జన్మస్థలంలో టీడీపీ నేతల అవినీతికి అంతే లేదు

కృష్ణా జిల్లా: స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు జన్మస్థలం నిమ్మకూరులో టీడీపీ నేతలు నీరు–చెట్టు పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని వైయస్‌ జగన్‌ విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నిమ్మకూరుకు వెళ్లిన వైయస్‌జగన్‌కు ఎన్‌టీఆర్‌ బంధువులు గ్రామంలో జరుగుతున్న అవినీతిని వైయస్‌జగన్‌కు వివరించారు. నీరు చెట్టు పేరుతో చెరువుల్లో పొక్లైయిన్లతో ఏకంగా 40 అడుగులు తవ్వి మట్టిని ట్రాక్టర్‌ రూ.350  చొప్పున అమ్ముతున్నారని విమర్శించారు. పైగా నీరు–చెట్టు కార్యక్రమం పేరుతో ప్రభుత్వం నుంచి రూ.8.50 లక్షలు వినియోగించారన్నారు. వీళ్లు చేయడం వల్ల నీళ్లు ఉపయోగపడవని, ఇందులో పశువులు పడితే బయటకు రావని చెప్పారు. ఎన్‌టీ రామారావు ఊరిని లోకేష్‌ దత్తత తీసుకున్నారు. ఇవాళ నందమూరి బంధువులు వెంకటేశ్వరరావు, ప్రభు, బసవతారకమ్మ బంధువులు కూడా నా వద్దకు వచ్చి ఈ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని చెప్పారన్నారు. ఐదు రోజుల పాటు స్టేషన్‌లో కూర్చొబెట్టి హింసించారన్నారు. టార్చర్‌ భరించలేక ఎన్‌టీఆర్‌ బంధువులు నా వద్దకు వచ్చారన్నారు. ఏమాత్రం ఆలోచన చేయకుండా, రైతులకు నష్టం జరుగుతుందని గ్రహించకుండా ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కృష్ణా జిల్లా పేరును నందమూరి తారక రామారావు పేరు పెట్టి, ఈ ఊరునే కాదు..ఈ జిల్లాను బాగు పరుస్తానని హామీ ఇచ్చారు. వైయస్‌ జగన్‌ నిర్ణయంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
 
Back to Top