బాబూ..ఇది చెరుకు ర‌సం కాదుపశ్చిమ గోదావరి:  చంద్ర‌బాబు.. గోదావ‌రి జిల్లాలో ప్ర‌జ‌ల‌కు తాగేందుకు మంచినీరు లేద‌ని, ఈ బాటిల్‌నిది చెరుకు ర‌సం కాద‌ని, ఇక్క‌డి ప్ర‌జ‌లు తాగే మంచి నీర‌ని వైయ‌స్ జ‌గ‌న్ చూపించారు. ప్ర‌జ‌ల‌కు తాగేందుకు మంచినీరు ఇవ్వ‌లేని వాళ్లు ప్ర‌భుత్వంలో ఉండి ఏం చేస్తున్నార‌ని ఆయ‌న ప్రశ్నించారు. చంద్ర‌బాబుకు ఎంత చెప్పినా అర్థం కావ‌డం లేద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలాంటి నీళ్లు తాగితే కిడ్నీలు బాగుంటాయా అని స్థానికులు అడుగుతున్నార‌ని చెప్పారు. ఇప్ప‌టికీ నాలుగో బాటిల్ చూపిస్తున్నాన‌ని, ఇప్ప‌టికైనా చంద్ర‌బాబుకు బుద్ధీ, జ్ఞానం ఉంటే మంచినీళ్లు ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని మెంటేపూడి మహిళలు వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తమ గ్రామానికి వచ్చిన వైయస్‌ జగన్‌కు స్థానికులు తాము తాగుతున్న నీటిని బాటిల్‌లో తీసుకొచ్చి చూపించారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌తి గ్రామంలో తాగునీటి ట్యాంకులు ఏర్పాటు చేసి ర‌క్షిత మంచినీటిని అందిస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు.  తనను కలిసిన ప్రతి ఒక్కరికి భరోసా కల్పిస్తూ వైయస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు. 

 
Back to Top