కోన గ్రామంలో వైయస్ జగన్

కృష్ణాః తమ కష్టాలు వినేందుకు జిల్లాకు వచ్చిన జననేతకు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్న రాజన్న కొడుకు వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ కు ప్రతీ ఒక్కరూ జేజేలు పలుకుతున్నారు. ;చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయడం లేదు. మా పంట భూములను బలవంతంగా లాక్కుంటున్నారని  ప్రజలు వైయస్ జగన్ కు తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. అధైర్యపడొద్దని వైయస్ జగన్ వారికి భరోసా కల్పిస్తున్నారు. బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే బాబు సర్కార్ బంగాళాఖాతంలో కలుస్తుందని హెచ్చరించారు. వచ్చేది మన ప్రభుత్వం, మళ్లీ రాజన్న పాలన వస్తుందని చెప్పారు. అడుగడుగునా వైయస్ జగన్ కు జిల్లా ప్రజానీకం బ్రహ్మరథం పట్టారు.

Back to Top