జననేతను కలిసిన లంక గ్రామాల ప్రజలు


తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తమ గ్రామానికి వచ్చిన వైయస్‌ జగన్‌ను లంక గ్రామాల ప్రజలు కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. వంతెన నిర్మించాలని ముంపు గ్రామాల ప్రజలు కోరారు. గంటి పెదపూడి వద్ద వారు వైయస్‌ జగన్‌ను కలిశారు. ప్రతిఏటా గోదావరి yð ల్టా ప్రాంతంలో వరదలు రావడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. గోదావరి పోటెత్తినప్పుడల్లా ముంపునకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రిళ్లు పట్టణానికి రావాలంటే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, గర్భిణులు, చదువుకున్న పిల్లలను బడికి పంపించాలంటే కూడా అవస్థలు పడుతున్నామన్నారు. ఈదుకుంటూ రావాల్సి వస్తుందని, పడవలపై ప్రయాణం చేయాల్సి వస్తుందని చెప్పారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ ..మనందరి ప్రభుత్వం రాగానే న్యాయం చేస్తానని హమీ ఇచ్చారు.
 
Back to Top