రథోత్సవంలో జననేత వైఎస్ జగన్


వైఎస్సార్ జిల్లా)
ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ
స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథోత్సవంలో పాల్గొని స్వయంగా
రథాన్ని లాగారు.

ఉదయం హైదరాబాద్ నుంచి
కడప కు చేరుకొని, అక్కడ నుంచి రోడ్ మార్గంలో ఒంటిమిట్ట కు చేరుకొన్నారు. అక్కడ
తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో పాలు
పంచుకొన్నారు. కళ్యాణోత్సవం తరువాత స్వామివారికి రథోత్సవం నిర్వహించటం ఆనవాయితీ.
దీన్ని పురస్కరించుకొని వైఎస్ జగన్ ఇందులో పాల్గొన్నారు. స్వయంగా భక్తులతో కలిసి
రథాన్ని ముందుకు లాగారు. జై శ్రీరామ్ అన్న నినాదాలు మిన్నంటుతుండగా రాముల వారి రథం
ముందుకు కదిలింది.

అటు కోదండ రామస్వామి
వారి దేవాలయంలో వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట ఎంపీ మిథున్
రెడ్డి, ఎమ్మెల్యేలు అంజాద్ బాషా, కోరుముట్ల శ్రీనివాసులు, పార్టీ జిల్లా
అధ్యక్షుడు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి ఉన్నారు. ఆలయ లాంఛనాల ప్రకారం అధికారులు జన
నేత వైఎస్ జగన్ కు స్వాగతం పలికారు. అర్చకులు ఆయన చేత పూజలు చేయించారు. అనంతరం
స్వామి వారి తీర్థ ప్రసాదాలు వైఎస్ జగన్ కు, ఇతర నేతలకు అందించారు. 

Back to Top