ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు

హైదరాబాద్ః ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పర్వదినం సందర్భంగా  ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్..తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.  ప్రతి ఒక్కరూ ఈద్ ముబారక్ ను సుఖసంతోషాలతో జరుపుకోవాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు. రంజాన్ పర్వదినం మాత్రమే కాదని...ప్రపంచ మానవాళికి అదొక స్ఫూర్తి అని అన్నారు. 

సర్వ మానవాళి సుఖంగా ఉండాలన్న ఆర్తి  ముస్లింల ప్రార్థనల్లో కనిపిస్తుందని వైయస్ జగన్ అన్నారు. సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి సాయపడాలన్న ఆశయం రంజాన్ పండుగలో అంతర్లీనంగా ఉన్న సందేశమని పేర్కొన్నారు. 
Back to Top