వైయస్ జగన్ ఈద్ ముబారక్

  • సామరస్యానికి, కరుణకు, దాతృత్వానికి రంజాన్ ప్రతీక
  • ప్రతి ముస్లిం సోదరుని ఇంట సుఖసంతోషాలు కలగాలి
  • ముస్లింల‌కు వైయ‌స్ జ‌గ‌న్ రంజాన్ శుభాకాంక్ష‌లు
హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్‌ పండుగ (ఈద్‌ ముబారక్‌) శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ పండుగ సామరస్యానికి, సహృద్బావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని, ప్రజలందరికీ సుఖ, సంతోషాలు కలగాలని వైయస్‌ జగన్‌ ఆకాంక్షించారు. దైవత్వాన్ని నింపుకునేందుకు అల్లాహ్‌కు ఇష్టమైన జీవన విధానాన్ని ముస్లింలు ఈ నెల రోజులు కఠిన ఉపవాస దీక్షను ఆచరిస్తారని అన్నారు. నెల రోజుల పాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే పుణ్యమాసానికి రంజాన్‌ ఒక ముగింపు వేడుక కాగా, ఐకమత్యంతో మెలగడం, క్రమశిక్షణ కలిగి ఉండడం, పేదలకు తోద్పడడం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని ఆయన తెలిపారు. జగన్ భయ్యా ఈద్ ముబారక్ అంటూ మైనారిటీ సోదరులు వైయస్ జగన్ కు విషెస్ తెలుపుతున్నారు. 

మహనీయుడైన మహ్మద్‌ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్‌ ఆవిర్భవించింది కూడా రంజాన్‌ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారని పేర్కొన్నారు. సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి సామపడాలన్న ఆశయం రంజాన్‌ పండుగలో అంతర్లీనంగా ఉన్న సందేశం అని వైయస్‌ జగన్‌ అన్నారు. రంజాన్‌ అంటే ఉపవాస దీక్షలు మాత్రమే కాదని, మనిషిలోని చెడు భావనల్ని, ఆధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ అని తెలిపారు. 




Back to Top